పెళ్లి పేరుతో యువతిని మోసం… నిందితుడు అరెస్ట్
ప్రజా ఆయుధం దినపత్రిక
పెళ్లి పేరుతో యువతిని మోసం… నిందితుడు అరెస్ట్
అమలాపురం, ఏప్రిల్ 08:
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకుని అనంతరం మోసం చేసిన వ్యక్తిని అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజమహేంద్రవరం కు చెందిన దవులూరి వినోద్ కుమార్ (33) యువతికి పెళ్లి చేస్తానని నమ్మబలికి, ఆమెతో సన్నిహితంగా మారి అనంతరం మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసును విచారించిన ఎస్సై శ్రీనివాస్ చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం బుధవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు.