ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి పత్రికా స్వేచ్ఛను హరించడమే: ఎంపీ హరీష్ బాలయోగి
అమలాపురం, ఏప్రిల్ 08:
ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి తీవ్రంగా ఖండనీయమని, ఇది పత్రికా స్వేచ్ఛను హరించే చర్య అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా సంస్థలు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయడం అత్యంత ముఖ్యమని, ఇటువంటి ఘటనలు మీడియా స్వేచ్ఛపై నేరుగా దాడిగా పరిగణించాల్సిందేనన్నారు.
ఈ ఘటనలో కొందరు వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం బాధాకరమని, హింసాత్మక చర్యలు సమాజానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు.
అమలాపురంలో ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడానికి జరిగిన యత్నం జిల్లాలో నెలకొన్న వైసీపీ విష సంస్కృతికి తార్కాణమని విమర్శించారు. ఇటువంటి సంఘటనలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, పత్రికా రంగం భద్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ ఘటనపై చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎంపీ హరీష్ బాలయోగి స్పష్టం చేశారు.