ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెసిడెంట్ కాకర శ్రీనివాస్
ప్రజా ఆయుధం దినపత్రిక
ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెసిడెంట్ కాకర శ్రీనివాస్
ముమ్మిడివరం, ఏప్రిల్ 08:
బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర ఎస్సీ (మాల) కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్‌ను రావులపాలెం నుంచి ముక్తేశ్వరం వరకు ఉన్న ప్రధాన పంటకాలువ నీటి సంఘం అధ్యక్షుడు కాకర శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కాకర శ్రీనివాస్ శాలువా, పూలమాలతో చెల్లి అశోక్‌ను సత్కరించి గౌరవించారు.
అనంతరం మాట్లాడిన శ్రీనివాస్, ప్రాంతంలోని దళిత రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అశోక్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులకు సంబంధించిన సమస్యలు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ విషయంపై స్పందించిన చెల్లి అశోక్, రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, వాటిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బడుగు సాయి తదితరులు ఉన్నారు.
![]()