“ముమ్మిడివరంలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా – నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు”
“ముమ్మిడివరంలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా – నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు”
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏప్రిల్ 05
డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని చెయ్యరు మరియు ఉప్పు చెరువుల గ్రామాలలో ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు నేటి తరాలకు ఆదర్శప్రాయమని, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.