రూ.2.71 లక్షల స్కాలర్షిప్ల పంపిణీకి ఏర్పాట్లు* – *కూటమి నాయకులకు ఆహ్వానం*
*రూ.2.71 లక్షల స్కాలర్షిప్ల పంపిణీకి ఏర్పాట్లు* – *కూటమి నాయకులకు ఆహ్వానం*
కడలి ఈశ్వరి మరియు తదేకం ఫౌండేషన్
ప్రజా ఆయుధం దినపత్రిక: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, జూలై 31: ఆగస్టు 1, 2026 (శనివారం) ఉదయం 11 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలంలోని ఎస్.ఎన్.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12 మంది విద్యార్థులకు, మూలపోలం గ్రామంలోని ఎం.పి.ఎం ట్రస్ట్ జూనియర్ కళాశాలలో 30 మంది విద్యార్థులకు, అలాగే ఇంజినీరింగ్, డిగ్రీ చదువుతున్న నలుగురు విద్యార్థులకు మొత్తం రూ.2,71,828 విలువైన స్కాలర్షిప్లను అందజేయనున్నారు.
కడలి ఈశ్వరి మరియు తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్, జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
![]()