ప్రజా సౌకర్యమే లక్ష్యం.. తెలంగాణలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ అందుబాటులోకి
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా సౌకర్యమే లక్ష్యం.. తెలంగాణలో ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ అందుబాటులోకి
ప్రజా ఆయుధం దినపత్రిక: హైదరాబాద్, జూలై 31: రాష్ట్ర ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల వివరాలను ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థకైనా లేదా ఇతర వ్యవస్థలకైనా అధికారికంగా సమర్పించేందుకు ఉపయోగపడే ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సర్టిఫికెట్ను ప్రజలు తమ పరిధిలోని మీ-సేవ కేంద్రాలు లేదా తహశీల్దార్ కార్యాలయాల్లో సులభంగా పొందవచ్చు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నమోదైన కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేయబడుతుంది.
ప్రభుత్వ సేవలు, ప్రైవేట్ సంస్థల అవసరాలు, విద్య, ఉపాధి, బ్యాంకింగ్ తదితర సందర్భాల్లో కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా సమర్పించేందుకు ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు ఒకే వేదికపై సౌకర్యవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త సేవను ప్రారంభించినట్లు పేర్కొంది.
![]()