గంగలకూరు అగ్రహారంలో కూటమి ప్రభుత్వ* *ఇంటింటా ప్రచార కార్యక్రమం*
*గంగలకూరు అగ్రహారంలో కూటమి ప్రభుత్వ* *ఇంటింటా ప్రచార కార్యక్రమం*
*నాగబత్తుల సుబ్బారావు ప్రచారం*
ప్రజా ఆయుధం దినపత్రిక: అంబాజీపేట, జూలై 31: జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపు మేరకు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలం, గంగలకూరు అగ్రహారం గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ, వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, మండల శాఖ అధ్యక్షుడు గూడాల ఫణి, మండల శాఖ కార్యదర్శి రవణం రాము, టీడీపీ సీనియర్ నాయకుడు నాగాబత్తుల వెంకట సుబ్బారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మంద నాగరాజు, గ్రామ శాఖ కార్యదర్శి మట్టపర్తి సతీష్, బూత్ కమిటీ కన్వీనర్లు మట్టపర్తి చినవెర్రియ్య, బంధన రాంబాబు, మట్టపర్తి రెడ్డమ్మ, కొప్పినీడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
![]()