ఉడుమూడిలో ఇంటింటా ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన: నక్క సునీల్ రాజు
ఉడుమూడిలో ఇంటింటా ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన: నక్క సునీల్ రాజు
ప్రజా ఆయుధం దినపత్రిక: ఉడుమూడి, జూలై 31: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, పి. గన్నవరం మండలం ఉడుమూడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ప్రచారం కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్క సునీల్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టా ప్రభాకర్, గ్రామ శాఖ కార్యదర్శి చికెలే మోహన్, మాజీ సర్పంచ్ నూకపెయ్యి ప్రసన్నకుమార్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ముచ్చర్ల సాయిబాబు, బూత్ కన్వీనర్ నేలపూడి శ్రీనివాసరావు, ముచ్చర్ల సోమరాజు, నేతల విజయ్ కుమార్, ఈసుపట్ల నాగరాజు, నేలపూడి రేవంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలు, సూచనలను నాయకులు తెలుసుకున్నారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
![]()