పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సన్మానం.. విశేష సేవలకు కలెక్టర్ అభినందనలు
పదవీ విరమణ పొందిన అధికారులకు ఘన సన్మానం.. విశేష సేవలకు కలెక్టర్ అభినందనలు
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: ప్రభుత్వ సేవలో అత్యంత నిబద్ధతతో విశేష సేవలు అందించిన పదవీ విరమణ పొందిన అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అభినందించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవితో కలిసి పదవీ విరమణ పొందిన జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, అల్లవరం తహసీల్దార్ వాజిపేయాజుల వెంకట నరసింహారావులను పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో వారు అత్యంత నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వహించి శాఖ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వారి పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అందించాలని ఆకాంక్షిస్తూ, వారు ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులను అభినందించారు.
![]()