కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మన కర్తవ్యం: గొల్లపల్లి అమూల్య
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మన కర్తవ్యం: గొల్లపల్లి అమూల్య
ప్రజా ఆయుధం దినపత్రిక: రాజోలు, జూలై 31: రాజోలు నియోజకవర్గంలో 40వ వారపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక “కేడర్ విత్ లీడర్” కార్యక్రమం తాటిపాక గ్రామంలోని జీఎస్ గార్డెన్స్‌లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడం నాయకులు, కార్యకర్తల బాధ్యత అని పేర్కొన్నారు.
పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమైన డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించాలని సూచించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రాజోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందువరుసలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు.
అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వివిధ ప్రజా సమస్యలకు సంబంధించిన అర్జీలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన దరఖాస్తులను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పెచ్చెట్టి నరసింహరావు (బాబు), ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![]()