ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై నిరంతర నిఘా ఉండాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై నిరంతర నిఘా ఉండాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక: ముమ్మిడివరం, జూలై 31: ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ భద్రతపై నిరంతర నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్ట్రాంగ్‌రూమ్‌లో అమలవుతున్న భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ నిఘా, అగ్నిమాపక పరికరాలు, ప్రవేశ నియంత్రణ, సీల్స్, తాళాల భద్రత తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్‌రూమ్ రికార్డులు, విజిటర్ రిజిస్టర్‌ను పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్‌రూమ్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూమ్ వద్ద 24 గంటల భద్రతా ఏర్పాట్లు కొనసాగాలని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ పని చేసే స్థితిలో ఉండేలా నిరంతర తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరాజ్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
![]()