అప్పనపల్లి కాజ్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
అప్పనపల్లి కాజ్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 31: మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలోని కాజ్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అప్పనపల్లి గ్రామంలో కాజ్వే పనులను పరిశీలించిన ఆయన, వరద ఉధృతి పెరిగితే వెంటనే కాజ్వేపై రాకపోకలను నిలిపివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచి అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సి.ఎస్. రాజు, డిప్యూటీ తహసీల్దార్ ఇబ్రహీం, ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజనీర్ రాము, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి జయశ్రీ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
![]()