జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నిరసన
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.. కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నిరసన
ప్రజా ఆయుధం దినపత్రిక: రాజమహేంద్రవరం, జూలై 31: జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ “డిమాండ్స్ డే” సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక అటాక్ కమిటీలను ఏర్పాటు చేయాలని, గతంలో ప్రకటించిన జర్నలిస్టుల ఇళ్లస్థలాల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక చొరవ తీసుకుని జీవో జారీ చేసి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించి రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమాజానికి నాలుగో స్తంభంగా నిలిచి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న జర్నలిస్టులకు పెన్షన్ మంజూరు చేయాలని, మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తం 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్ఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల వెంకటేశ్వరరావు, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు త్రినాథ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామమూర్తి, ఉపాధ్యక్షురాలు విశాలాక్షి, సీనియర్ జర్నలిస్టు లాల్, ఏపీ బీజేఏ సభ్యులు చంటిబాబు, ప్రసాద్, హరిగణేష్ తదితరులు పాల్గొన్నారు.
![]()