జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.. కొత్తపేటలో డిమాండ్స్ డే నిరసన
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.. కొత్తపేటలో డిమాండ్స్ డే నిరసన
ప్రజా ఆయుధం దినపత్రిక: కొత్తపేట, జూలై 31: జర్నలిస్టులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీబీజేఏ) రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు శుక్రవారం కొత్తపేటలో జర్నలిస్టులు డిమాండ్స్ డే నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి వాకాడ బాబులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ మాసపత్రికను పునరుద్ధరించాలని, సమాచార శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ రాయితీపై ఏసీ ప్రయాణ సౌకర్యం, మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, జర్నలిస్టులకు అవార్డులు, కార్మిక బీమా సదుపాయం, వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బంగారు రాజు, పల్నాటి చంటి, ఎన్. శ్రీను, దంగేటి వెంకటేశ్వరరావు, నామాల శ్రీనివాస్, రాయుడు జయదేవ్, బొక్క తమ్మిరాజు, ఇళ్ల విక్రమరావు, నక్క రమేష్, గుత్తుల ఏడుకొండలు, నేరేడుమిల్లి ఏడుకొండలు, కొప్పిశెట్టి నరేష్, పులిదిండి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![]()