పదవీ విరమణ పొందిన నెల్లి నేతాజీని సన్మానించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
పదవీ విరమణ పొందిన నెల్లి నేతాజీని సన్మానించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక: కొత్తపేట, జూలై 31: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి గ్రామంలో నిర్వహించిన నెల్లి నేతాజీ పదవీ విరమణ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెల్లి నేతాజీని ఘనంగా సన్మానించి, ప్రభుత్వ సేవలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. ప్రజలకు అంకితభావంతో సేవలందించి విధులను సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
![]()