మారేడుబాకలో టీడీపీలో చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
మారేడుబాకలో టీడీపీలో చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
ప్రజా ఆయుధం దినపత్రిక: మండపేట, జూలై 31: మండపేట మండలం మారేడుబాక గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు శుక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ టీడీపీ నాయకుడు పసలపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాదే సుబ్బారావు, కాళ్ల గోవిందు, కాళ్ల ఎస్తేరు రాణి, సంగిశెట్టి శ్రీకాంత్, పలివెల వరప్రసాద్, కాకి అవినాష్, వానపల్లి నాగబాబు టీడీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి తాతారావు, అన్నవరం దేవస్థానం కమిటీ డైరెక్టర్ యరగతపు బాబ్జి, ఎంపీపీ ఉండమట్ల వాసు, మాజీ ఎంపీటీసీ పసలపూడి శ్రీనివాస్, రాయుడు గంగరాజు, పైడిమళ్ల డేవిడ్ రాజు, పల్లి పురుషోత్తం, పుట్టా నారాయణమూర్తి, నూని సూరిబాబు, పట్నాల మురళి, సోడసాని మురళి, పాలిక రమణ, దంగేటి శ్రీనివాస్, వల్లు పాండురంగ, పానుగంటి శివకుమార్, ముత్యాల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.
![]()