భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
భోగాపురం పర్యటనకు ప్రధాని మోదీ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక: భోగాపురం, జూలై 31: ఉత్తరాంధ్ర వికాసానికి, సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మైలురాయిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగ సభకు శనివారం (ఆగస్టు 1) భారత ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం సభా ప్రాంగణాన్ని సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లు, వేదిక వద్ద కల్పిస్తున్న సౌకర్యాలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు సూచనలు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
![]()