భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
ప్రజా ఆయుధం దినపత్రిక: భోగాపురం, జూలై 31: ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి సమావేశమై కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాజాం నియోజకవర్గం నుంచి సుమారు 10 వేల మంది కార్యకర్తలు, ప్రజలు ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. సభకు హాజరయ్యే వారికి రవాణా, భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనపై విస్తృతంగా చర్చించి సంబంధిత అధికారులకు, బాధ్యులకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు సూచించారు.
![]()