ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్
ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్
ప్రజా ఆయుధం దినపత్రిక: గన్నవరం, జూలై 31: ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతిక రంగం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
![]()