ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక.. రూ.5,350 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన
📰 ప్రజా ఆయుధం దినపత్రిక
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపిక.. రూ.5,350 కోట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోకేష్ శంకుస్థాపన
ప్రజా ఆయుధం దినపత్రిక: పత్తికొండ, జూలై 30: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,350 కోట్ల వ్యయంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. అలాగే టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు కూడా రాష్ట్రంలో తమ పెట్టుబడులను విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
పారిశ్రామికాభివృద్ధి, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ కారణంగానే ప్రపంచ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని హరిత ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
![]()