లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన ఎంపీ హరీష్ బాలయోగి
లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన ఎంపీ హరీష్ బాలయోగి
ప్రజా ఆయుధం దినపత్రిక: న్యూఢిల్లీ, జూలై 30: యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు, బ్లూమ్స్బరీకి చెందిన లార్డ్ ఉదయ్ నాగరాజుతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్ బాలయోగి లోకసభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తికర అంశాలు, భారత్–యూకే సంబంధాలు, పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు హరీష్ బాలయోగి, లార్డ్ ఉదయ్ నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీ భారత్–యునైటెడ్ కింగ్డమ్ మధ్య పార్లమెంటరీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తమైంది.
![]()