జితేంద్ర సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ
జితేంద్ర సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ
జితేంద్ర సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయం: ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక: కొత్తపేట, జూలై 30: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న జితేంద్ర సేవా ఫౌండేషన్ సేవలు ఎంతో అభినందనీయమని కొత్తపేట ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ అన్నారు. గురువారం కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామానికి చెందిన బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలుడు ఆలపాటి అజయ్ సత్యవర ప్రసాద్ వైద్య చికిత్స కోసం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన రూ.1 లక్షల చెక్కును బాలుడి తండ్రి ఆలపాటి ప్రకాశరావుకు ఆర్డీవో అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి జితేంద్ర సేవా ఫౌండేషన్ చొరవ తీసుకుని దాతల సహకారంతో ఆర్థిక చేయూత అందించడం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ, బాలుడు అజయ్ సత్యవర ప్రసాద్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించిన జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ జితేంద్ర కుమార్, జితేంద్ర న్యూస్ గ్రూప్స్ ద్వారా దాతలకు విజ్ఞప్తి చేయగా పలువురు ఉదారంగా స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఆ సహకారంతో సేకరించిన నిధుల్లో రూ.1 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.
బాలుడి తండ్రి ఆలపాటి ప్రకాశరావు మాట్లాడుతూ, తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ కుటుంబ పరిస్థితిని సమాజానికి తెలియజేసి దాతల సహకారాన్ని సమీకరించిన జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ జితేంద్ర కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ జితేంద్ర కుమార్, ట్రస్ట్ సభ్యులు సంసాని బాలాజీ, ఆలపాటి వేణుగోపాల్, ఆలపాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
![]()