భోగాపురం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్
భోగాపురం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్
భోగాపురం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్
ప్రజా ఆయుధం దినపత్రిక: విశాఖపట్నం, జూలై 30: ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ గురువారం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని 56వ వార్డు ఇన్చార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన జన సమీకరణ, రవాణా, సమన్వయ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెల్లి అశోక్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఇన్చార్జి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో 56వ వార్డు ఇన్చార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()