న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి: జిల్లా కలెక్టర్‌కు ఐఎల్ఏ, బార్ అసోసియేషన్ వినతి
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి: జిల్లా కలెక్టర్‌కు ఐఎల్ఏ, బార్ అసోసియేషన్ వినతి
ప్రజా ఆయుధం దినపత్రిక: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, జూలై 30: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని త్వరితగతిన అమలు చేసి న్యాయవాదులకు ప్రాణ రక్షణ కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టి. పృథ్వి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు వృత్తిపరమైన సహకారంగా అందిస్తున్న స్టైఫండ్‌ను నెలకు రూ.10 వేల వరకు పెంచాలని, అర్హులైన న్యాయవాదులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ జిల్లా అధ్యక్షుడు డి. చిరంజీవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, ప్రధాన కార్యదర్శి నల్లా సురేష్, సీనియర్ న్యాయవాది నల్లా ప్రభాకర్ రావు, బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బడుగు భాస్కర్ జోగేష్, పెయ్యల సత్యనారాయణ, గుర్రాల రాంబాబు, కుంచే శ్రీనివాసరావు, సోమరాజు రవికుమార్, ఎం. సత్యనారాయణ, వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
![]()