గురుకులాల్లో అత్యాధునిక మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు… విద్యార్థులకు నాణ్యమైన భోజనమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
గురుకులాల్లో అత్యాధునిక మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు… విద్యార్థులకు నాణ్యమైన భోజనమే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ప్రజా ఆయుధం దినపత్రిక: హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలో అమలు చేస్తున్న నమూనాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యాధునిక మెకనైజ్డ్ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ప్రేమతో, బాధ్యతతో తమ పిల్లల భవిష్యత్తు కోసం కలలు కంటున్నారో, ప్రభుత్వం కూడా అంతే బాధ్యతతో వారి ఉన్నత భవిష్యత్తు కోసం కృషి చేస్తోందని అన్నారు. నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నత విద్యను అందించి ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
![]()