వేపూరు గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
వేపూరు గ్రామ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
ప్రజా ఆయుధం దినపత్రిక: కుప్పం, జూలై 29: చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు గ్రామంలో నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సమస్యలు, జీవనోపాధి, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మహిళలతో ఆత్మీయంగా మాట్లాడిన నారా భువనేశ్వరి, వారి సూచనలు, సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()