గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసిన డాక్టర్ పండుల రవీంద్రబాబు (IRS)కు అభిమానుల అభినందనలు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసిన డాక్టర్ పండుల రవీంద్రబాబు (IRS)కు అభిమానుల అభినందనలు
ప్రజా ఆయుధం దినపత్రిక: ఏలూరు, జూలై 29: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఎంబీబీఎస్ వైద్యుడు, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పండుల రవీంద్రబాబు (ఐఆర్ఎస్, ఎంబీబీఎస్) ను ఆయన ఏలూరులోని స్వగృహంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా తన పదవీకాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సేవ, ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజా జీవితంలో మరింత క్రియాశీలకంగా కొనసాగుతూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
![]()