రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ఎమ్మెల్యే వేగుళ్ళ
రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ఎమ్మెల్యే వేగుళ్ళ
ప్రజా ఆయుధం దినపత్రిక: కపిలేశ్వరపురం, జూలై 29: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. బుధవారం కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన, లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ, వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా, ఆనందంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కోరుమిల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో రూ.3 కోట్ల 26 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధనస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆచంట సత్యనారాయణ, కొండిశెట్టి నాగేశ్వరరావు, మోటుపల్లి బాపిరాజు, కాకులపాటి సుబ్రహ్మణ్యం, సుంకర ధర్మరాజు, కొండిశెట్టి నరసన్నారాయణ, కొండిశెట్టి సూర్యరావు, ఆచంట శ్రీనివాసరావు, తుట్టుపు నాగరాజు, తుట్టుపు లోవరాజు, అర్లపల్లి పట్టాభిరామయ్య, పెద్దిరెడ్డి సత్తిబాబు, అరిగెల పాపారావు, కపిలేశ్వరపురం మండల అధ్యక్షుడు బలవరెడ్డి సత్తిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు, రాష్ట్ర కుమ్మరి సాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయకుమారి, అమలాపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి దేవు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
![]()