బండార్లంకలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కరపత్రాల పంపిణీ
బండార్లంకలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ, అభివృద్ధి కరపత్రాల పంపిణీ
ప్రజా ఆయుధం దినపత్రిక: బండార్లంక, జూలై 29: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కరపత్రాలను బండార్లంక గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీశైల దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి చింతా శంకరమూర్తి నాయకత్వం వహించారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షుడు గుమ్మడి బ్రహ్మాజీ, యూనిట్ కో-ఇన్చార్జి యాళ్ల కుమార్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()