జనసేన కార్యకర్త ముంగండ సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
జనసేన కార్యకర్త ముంగండ సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక: పి. గన్నవరం, జూలై 29: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటివారి పాలెంలో ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్త, రిటైర్డ్ ఎస్బీఐ ఉద్యోగి ముంగండ సత్యనారాయణ కుటుంబ సభ్యులను పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ముంగండ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో జనసేన పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![]()