V9 ప్రజా ఆయుధం మీడియా మేనేజ్మెంట్ ఎడిటర్ వినయ్ కుమార్‌ను పరామర్శించిన పెదపూడి శ్రీనివాస్
V9 ప్రజా ఆయుధం మీడియా మేనేజ్మెంట్ ఎడిటర్ వినయ్ కుమార్‌ను పరామర్శించిన పెదపూడి శ్రీనివాస్
ప్రజా ఆయుధం దినపత్రిక: అయినవిల్లి, జూలై 29: V9 ప్రజా ఆయుధం మీడియా మేనేజ్మెంట్ ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్‌ను పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పెదపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ దేవస్థానం చైర్మన్, మాజీ విద్యా కమిటీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెదపూడి శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. ఇటీవల కిడ్నీ స్టోన్స్‌కు స్టెంట్ శస్త్రచికిత్స చేయించుకుని వైద్యుల సూచన మేరకు అయినవిల్లి మండలం శానపల్లిలంకలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న వినయ్ కుమార్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెదపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ, “మేధావి వర్గం” అనే శీర్షికతో “ప్రతి అక్షరం ప్రజా ఆయుధం” అనే నినాదాన్ని ఆచరణలో నిలుపుతూ ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తున్న ప్రజా ఆయుధం మీడియా సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలో బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజా ఆయుధం మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా “స్థానికులకే అవకాశం” అనే నినాదాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజా ఆయుధం మీడియా కలం సమర్థవంతంగా పనిచేస్తోందని, “మీ కలమే మా ఆయుధం” అంటూ ప్రజా ఆయుధం మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తనను పరామర్శించి ధైర్యం చెప్పిన పెదపూడి శ్రీనివాస్‌కు వినయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
![]()