డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతంపై టీడీపీ ప్రజాప్రతినిధుల సమీక్ష
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి, పార్టీ సంస్థాగత బలోపేతంపై టీడీపీ ప్రజాప్రతినిధుల సమీక్ష
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట, జూలై 28: కొత్తపేట శాసనసభ్యుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో మంగళవారం నిర్వహించిన లంచ్ మీటింగ్లో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, పి. గన్నవరం నియోజకవర్గ కో-కన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.
![]()