బహుజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: మంత్రి సవితకు అఖిలభారత బహుజన సంక్షేమ సంఘం వినతి
బహుజన సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: మంత్రి సవితకు అఖిలభారత బహుజన సంక్షేమ సంఘం వినతి
ప్రజా ఆయుధం దినపత్రిక: పెనుగొండ, జూలై 28: అఖిలభారత బహుజన సంక్షేమ సంఘం (ఏఐబీడబ్ల్యూఏ) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు రామంజప్ప అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి సవితను పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘంలో పనిచేస్తున్న నాయకులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయడంతో పాటు, సంక్షేమ పథకాల లబ్ధి ఇంకా అందని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనవళ్ల ఆంజనేయులు, రామంజప్ప, జిల్లా అధికార ప్రతినిధి దాసరి కాంతమ్మ, లేపాక్షి మండల అధ్యక్షురాలు నాగమణి, పరిగి మండల అధ్యక్షుడు వ్యక్తి రవికుమార్, హిందూపూర్ మండల అధ్యక్షురాలు నాగమ్మ, ప్రధాన కార్యదర్శి గంగరత్నమ్మ, మండల నాయకులు సునీత, వెంకమ్మ, శివమ్మ, అంజనప్ప, కొత్తచెరువు అంజినప్ప, రాము, రెడ్డిపల్లి మారెప్ప, రామగిరి మండల ఉపాధ్యక్షుడు తిమ్మాపురం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
![]()