మధిరలో బీఎల్ఏలు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రజా ఆయుధం దినపత్రిక
మధిరలో బీఎల్ఏలు, కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ప్రజా ఆయుధం దినపత్రిక: మధిర, జూలై 28: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ బీఎల్ఏలు, వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును కాపాడటమే ప్రజాస్వామ్యానికి అసలైన పునాదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న బీఎల్ఏలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి అర్హుడి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మధిర నియోజకవర్గంలో ఇప్పటికే 90 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా బూత్ల వారీగా సమన్వయంతో పూర్తి చేసి వంద శాతం నమోదు లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతి బీఎల్ఏకు, వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా పూర్తి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
![]()