డీఎస్సీ అక్రమాలపై అమలాపురంలో వైసీపీ నిరసన… మాజీ ఎంపీ చింతా అనురాధ
డీఎస్సీ అక్రమాలపై అమలాపురంలో వైసీపీ నిరసన… మాజీ ఎంపీ చింతా అనురాధ
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాల కారణంగా వేలాది మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరి, పినిపే శ్రీకాంత్, కటకంశెట్టి ఆదిత్య, పితాని బాలకృష్ణ, జున్నూరి బాబీ, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, దంగేటి రాంబాబు, కుడిపూడి బాబు, భరత్, సలాది సతీష్, దంతులూరి రోహిత్ వర్మ, మిండుగుదిటి శిరీష్, ములపర్తి శ్రీను, జిల్లెల రమేష్, దొమ్మేటి సత్యమోహన్, దూడల ఫణి, విత్తనాల మూర్తి, దొంగ బాలాజీ, బడుగు మోహన్, కేత భానుతేజ, బల్ల శ్యామ్, కల్వకొలను ఉమా, సంసాని నాని, కొనుకు బాపూజీ, పందిరి శ్రీహరి, కొనుకు గౌతమి, బర్రె సీతారత్నం, సత్యం కాపు, అంబికా శ్రీను, విద్యార్థులు, యువత, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()