అంగన్వాడీ హెల్పర్లకు యూనిఫాంల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
అంగన్వాడీ హెల్పర్లకు యూనిఫాంల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక: అమలాపురం, జూలై 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని అమలాపురం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. మంగళవారం అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని తన క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వం అందించిన నూతన యూనిఫాంలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రసూతి, బాలల ఆరోగ్య సంరక్షణలో హెల్పర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. వారి సేవలకు గుర్తింపుగా, గౌరవాన్ని మరింత పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం నాణ్యమైన యూనిఫాంలను అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, హెల్పర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]()