ప్రజా ఆయుధం ఎడిటర్ వినయ్ కుమార్‌ను పరామర్శించిన మీడియా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ నాగాబత్తుల శ్రీనివాస్
ప్రజా ఆయుధం ఎడిటర్ వినయ్ కుమార్‌ను పరామర్శించిన మీడియా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ నాగాబత్తుల శ్రీనివాస్
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామంలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రజా ఆయుధం మీడియా మేనేజ్మెంట్, ఎడిటర్ వినయ్ కుమార్‌ను సోమవారం ప్రజా ఆయుధం మీడియా లీగల్ అడ్వైజర్, రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ డైరెక్టర్, హైకోర్టు న్యాయవాది అడ్వకేట్ నాగాబత్తుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాగాబత్తుల శ్రీనివాస్, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజా ఆయుధం మీడియా కార్యకలాపాలు, ప్రస్తుత మీడియా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక పరిస్థితులు, సంస్థ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు నిష్పాక్షికంగా, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో ప్రజా ఆయుధం మీడియా నిరంతరం కృషి చేస్తోందని, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని నాగాబత్తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింతగా సంపాదిస్తూ సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తూ త్వరలోనే తిరిగి మీడియా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటానని వినయ్ కుమార్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసి పరామర్శించిన అడ్వకేట్ నాగాబత్తుల శ్రీనివాస్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
![]()