💐 నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
అయినవిల్లి( ప్రజా ఆయుధం)
15 మే 2026:
💐 నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ వినయ్ కుమార్
అయినవిల్లి మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శానపల్లిలంక గ్రామానికి చెందిన గ్రామ కాపరస్తులు యడ్ల వీర వెంకట సత్యనారాయణ కనిష్ట కుమార్తె స్వాతి, ఎస్ మూలపోలం గ్రామానికి చెందిన గ్రామ కాపరస్తులు పాము శ్రీరామ కృష్ణమూర్తి కనిష్ట కుమారుడు సూర్య ప్రసాద్ (పండు) వివాహం ఈ నెల 1వ తేదీన శుక్రవారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ వివాహానికి ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ హాజరు కావలసి ఉన్నప్పటికీ, అనుకోని కారణాల వల్ల ఆ వేడుకకు హాజరు కాలేకపోయారు. అయితే శుక్రవారం ఎస్ మూలపోలం గ్రామంలోని సూర్య ప్రసాద్ స్వగృహాన్ని సందర్శించి నూతన వధూవరులను ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వధూవరులిద్దరినీ ఆశీర్వదించిన వినయ్ కుమార్, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని, వారి కుటుంబం ఆనందాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో వారికి జన్మించే పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు.
అలాగే కుటుంబ బంధాలు, ఆత్మీయతలు, గ్రామీణ సంప్రదాయాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని పేర్కొన్నారు. వివాహం అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని, పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకంతో జీవితం మరింత అందంగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కన్నేపాముల నాగేశ్వరరావు, నేరేడిమిల్లి ప్రసాద్, పాము మురళి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
📱 ప్రజా ఆయుధం మీడియా
1) WhatsApp Channel:
https://whatsapp.com/channel/0029VaAedz6BadmYaSWz3B12
2) WhatsApp Group:
https://chat.whatsapp.com/BrX1qBJm2QA4o159Xg1NM9?mode=gi_t
_ప్రతి అక్షరం ప్రజా ఆయుధం_
![]()