🚨 మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
ప్రజా ఆయుధం దినపత్రిక
🚨 మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
ప్రజా ఆయుధం అమలాపురం, 14 May 2026:
మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.
📌 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు:
– కర్ణాటక – మహారాష్ట్ర – అరుణాచల్ ప్రదేశ్
– హరియాణా – ఝార్ఖండ్ – మణిపూర్
– మేఘాలయ – మిజోరం -నాగాలాండ్
– ఒడిశా – పంజాబ్ – సిక్కిం – ఉత్తరాఖండ్
– త్రిపుర
రాష్ట్రాల్లో కూడా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
🗳️ ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు
ఈ దశలో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని భారత ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసిందన్నారు.
📅 ఏపీలో ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్
📖 జూన్ 5 నుంచి 14 వరకు
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
🏠 జూన్ 15 నుంచి జులై 14 వరకు
సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు.
📋 జులై 21
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.
⚖️ జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు
అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
📝 సెప్టెంబర్ 22
తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.
📢 ప్రజలకు పిలుపు
అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఇప్పటికే నమోదైన వారు తమ వివరాలను సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రతి అక్షరం ప్రజా ఆయుధం
![]()