దళపతి’ నుంచి ముఖ్యమంత్రిగా విజయ్… తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం
ప్రజా ఆయుధం దినపత్రిక
‘దళపతి’ నుంచి ముఖ్యమంత్రిగా విజయ్… తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం
ప్రజా ఆయుధం చెన్నై, మే 9, 2026:
తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలపడంతో టీవీకే శ్రేణుల్లో సంబరాలు వెల్లివిరిశాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 120 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. అనంతరం విజయ్ గవర్నర్ను కలిసి మద్దతు లేఖలను సమర్పించారు.
దీంతో విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ మేరకు విడుదలైన ఆదేశాల కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. టీవీకే నాయకులు, అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరుకానున్నారు.
‘విజయ్ అనే నేను’ అంటూ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే క్షణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![]()