పల్లి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజా ఆయుధం మీడియా అధినేత వినయ్ కుమార్ నేరేడుమిల్లి
ప్రజా ఆయుధం దినపత్రిక
పల్లి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజా ఆయుధం మీడియా అధినేత వినయ్ కుమార్ నేరేడుమిల్లి
ప్రజా ఆయుధం అమలాపురం, మే 9, 2026:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా నిర్వహించిన పల్లి మోహన్ కుమార్ – పుష్పాంజలి వివాహ వేడుకలో ప్రజా ఆయుధం దినపత్రిక అధినేత, ఎడిటర్ వినయ్ కుమార్ నేరేడుమిల్లి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా దాంపత్య జీవితం పరస్పర ప్రేమ, నమ్మకం, ఆప్యాయతలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ బంధాలను గౌరవిస్తూ ఆనందంగా జీవించాలని నవ వధూవరులకు సూచించారు.
ఈ వివాహ కార్యక్రమంలో పాస్టర్ సుందరం, వరుడు అన్నగారు పల్లి ఈశ్వరరావు, జంగా నాగమణి తదితర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేదిక ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సందడిగా కొనసాగింది.
![]()