కడలి వారి వివాహ వేడుకలో జర్నలిస్ట్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక:
కడలి వారి వివాహ వేడుకలో పాల్గొన్న జర్నలిస్ట్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం అమలాపురం, మే 07, 2026:
గురువారం రాత్రి అమలాపురం కొంకాపల్లిలోని క్షత్రియ కళ్యాణ మండపంలో కడలి వారి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వరుడు నవీన్‌కు పువ్వుల గుత్తి అందజేసి వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక వాస్తవ్యులు కడలి కనకదుర్గ – భూపతి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చి॥ నవీన్ B.Tech వివాహం, దుంగా రమేష్ – లక్ష్మీకుమారి దంపతుల ఏకైక కుమార్తె డా॥ సత్య లహరితో పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. డా॥ సత్య లహరి న్యూరాలజీలో మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివాహ వేడుకకు బంధుమిత్రులు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. అలాగే వైసీపీ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కూడా వివాహానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలో సీనియర్ జర్నలిస్ట్ నేరేడుమిల్లి వినయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గ – భూపతి దంపతులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు।
![]()