బండి వారి వివాహానికి ప్రజా ఆయుధం మీడియా హాజరు
బండి వారి వివాహానికి ప్రజా ఆయుధం మీడియా హాజరు
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 07, 2026:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్ళకూరు నల్లవారి పేటలో జరిగిన బండి వారి పరిశుద్ధ వివాహ వేడుకకు ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ వినయ్ కుమార్ నేరేడుమిల్లి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ వేడుకకు బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“వివాహము అన్ని విషయములలో ఘనమైనది” అనే హెబ్రీయులకు 13:4 వాక్య సందేశంతో నిర్వహించిన ఈ పవిత్ర వివాహ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
కీ॥శే॥ బండి వెర్రియ్య – కొండమ్మ దంపతుల మనుమడు, బండి సూర్యనారాయణ – ధనలక్ష్మి దంపతుల కనిష్ఠ కుమారుడు చి॥ వీరబాబు వివాహం, నేదునూరు గ్రామ బుచ్చెన్నమెరక వాస్తవ్యులు గుత్తాల లక్ష్మణరావు – కుమారి దంపతుల ఏకైక కుమార్తె చి॥సౌ॥ దివ్య జ్యోతితో పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది.
గురువారం ఉదయం 10 గంటలకు బిళ్ళకూరులోని ఆర్.సి.ఎమ్ చర్చ్‌లో ఫాదర్ కె. ఆంథొని ఆధ్వర్యంలో క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహ కార్యక్రమం నిర్వహించారు.
ప్రార్థనలు, బైబిల్ వచనాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది.
అనంతరం ఉదయం 11 గంటల నుంచి బిళ్ళకుర్రులోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నీటి సంఘం డీసీ కాకర శ్రీనివాస్ కూడా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
![]()