మే 5 నుంచి ఉచిత సమ్మర్ ఆర్చిరీ, టైక్వాండో, బాక్సింగ్ శిక్షణ శిబిరాలు ప్రారంభం
మే 5 నుంచి ఉచిత సమ్మర్ ఆర్చిరీ, టైక్వాండో, బాక్సింగ్ శిక్షణ శిబిరాలు ప్రారంభం
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆర్చిరీ, టైక్వాండో, బాక్సింగ్ ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రాండ్ మాస్టర్ టి. అబ్బులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ నుంచి జూన్ 8 వరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు కొత్తూరు సెంటర్ పాత రైస్ మిల్లు వద్ద శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయని తెలిపారు.
6 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆసక్తి ఉన్న బాలబాలికలు ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
నమోదు కోసం సీనియర్ మాస్టర్ ఎన్. సెందిల్ కుమార్, కోచ్స్ పి. సత్యకాంత్, జి. సతీష్, టి. సందీప్ కిరణ్‌లను సంప్రదించాలని, వివరాలకు 9989383418, 9533364441 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
![]()