అమలాపురంలో ప్రజాదర్బార్ – 24 అర్జీల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావ
అమలాపురంలో ప్రజాదర్బార్ – 24 అర్జీల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రజాదర్బార్లో మొత్తం 24 అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
అనంతరం నిర్వహించిన క్యాడర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినట్లుగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం మరికొన్ని సంవత్సరాలు కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం పార్టీకి కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చిందని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, చెరుకూరి సాయిరాం, పెచ్చెట్టి విజయలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, కంకటాల రామం, అల్లాడ స్వామినాయుడు, పెచ్చెట్టి చంద్రమౌళి, అధికారి జయ వెంకటలక్ష్మి, చల్లంగి సాయిబాబు, చిక్కం సుధారాణి, మట్ట మహాలక్ష్మి ప్రభాకర్, కర్రీ రామస్వామి, పొలమూరి ధర్మపాల్, అధికారి బాబ్జి, అబ్బాయి వెంకన్న, గుత్తుల నాగేశ్వరరావు, గెల్ల మీనాకుమారి, వలవల శివరావు, ఏరుబండి వెంకటేశ్వరరావు, పచ్చిమాల ఏడుకొండలు, మాడ మాధవి, పలివెల శ్రీనివాసరావు, నల్లా చిట్టి తదితరులు పాల్గొన్నారు.
![]()