నరేంద్రపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
నరేంద్రపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మత్స్యకారులకు పెన్షన్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ను ₹4000కు పెంచుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, మూడు నెలల పెన్షన్ను కలిపి ₹7000గా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇది పేదల పక్షాన ప్రభుత్వం నిలబడుతున్నదానికి నిదర్శనమని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.
పెన్షన్ ద్వారా నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లంకల గన్నవరం గ్రామానికి మంజూరైన డయాలసిస్ పెన్షన్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![]()