వెదురుపాక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం – టాపర్లకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఘన సత్కారం
వెదురుపాక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం – టాపర్లకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఘన సత్కారం
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
రాయవరం మండలం వెదురుపాక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 592 మార్కులతో జె. బ్లెస్సీ నియోజకవర్గం, రాయవరం మండలంలో మొదటి ర్యాంకు సాధించగా, 586 మార్కులతో సి.హెచ్ హర్షిని రెండవ ర్యాంకు, 583 మార్కులతో ఎ. మణికంఠ మూడవ ర్యాంకు సాధించారు.
ఈ ముగ్గురు విద్యార్థులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శుక్రవారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దుశ్శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయం ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నిరంతరం కొత్త నైపుణ్యాలు అభ్యసిస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
లక్ష్యాలను గుర్తించుకొని గట్టి పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల విజయానికి కారణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు భవిష్యత్తు నిర్మాణంలో దిక్సూచి పాత్ర పోషించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, శిరంగి ఈశ్వరరావు, ఎన్. రాజేష్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రామ లక్ష్మణ మూర్తి, హెచ్ఎం పి. రాంబాబు, ఉపాధ్యాయులు వై. రాంబాబు, కె. వీర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
![]()