నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించిన వేగుళ్ల లీలాకృష్ణ – నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులు
నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించిన వేగుళ్ల లీలాకృష్ణ – నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి నివాళులు
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం, మే 01:
పితృవియోగంతో బాధపడుతున్న జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించిన నాదెండ్ల భాస్కరరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు.
![]()