రామచంద్రాపురం పట్టణంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్
రామచంద్రాపురం పట్టణంలో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
రామచంద్రాపురం నియోజకవర్గం పట్టణంలో ఒకటో తేదీ సందర్భంగా అవ్వతాతలు మరియు విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ప్రజల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించబడింది.
![]()