గోదావరి మహా పుష్కరాలు 2027 ముందస్తు ఏర్పాట్లు – నాలుగు రోజుల్లో రేషనలైజ్డ్ అంచనాలు సమర్పించాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
గోదావరి మహా పుష్కరాలు 2027 ముందస్తు ఏర్పాట్లు – నాలుగు రోజుల్లో రేషనలైజ్డ్ అంచనాలు సమర్పించాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక
ప్రజా ఆయుధం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1:
గోదావరి మహా పుష్కరాలు 2027 ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మౌలిక వసతుల కల్పన అంచనాలను పుష్కర యాత్రికుల తాకిడికి అనుగుణంగా కచ్చితత్వంతో రేషనలైజేషన్ చేసి నాలుగు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గోదావరి మహా పుష్కరాలు 2027 ముందస్తు మౌలిక వసతుల కల్పనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెండు దఫాలుగా నిర్వహించిన సమీక్షల్లో రూపొందించిన అంచనాలను తిరిగి పునఃపరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రేషనలైజ్డ్ అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
కోనసీమ ప్రాంతంలో సుమారు 1.5 కోట్ల మంది పుష్కర యాత్రికులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ప్రముఖ దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. మండలాల వారీగా ఘాట్లు, వసతులపై సమగ్రంగా చర్చించి నాలుగు రోజుల్లో ఖచ్చితమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
అంతకుముందు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల నూతన ప్రతిపాదనలపై ఇంజనీర్లతో విడివిడిగా సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
![]()